చేనేతల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన చేనేతలు..


సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేతల నిరసన ర్యాలీ ధర్నా
విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి : చేనేతల న్యాయమైన డిమాండ్ల అమలు కు, రాష్ట్రంలోని 16 చేనేత సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో సోమవారం రోజున పుట్టపర్తి గణేష్ సర్కిల్ చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసుకు చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వెంకటనారాయణ, జెవి. రమణ, గిర్రాజు రవి, తుంపర్తి పరమేష్, జింక చలపతి గడ్డం రంగా శీల నారాయణస్వామి తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,నేతన్న నేస్తం పథకాన్ని 25 వేల రూపాయలను వెంటనే పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమ కు విధించిన జీఎస్టీని రద్దు చేయాలి అని, 50 సంవత్సరములు నిండిన నేత కార్మికులకు ఫించను సౌకర్యం కల్పించాలి అని, చేనేత సహకార సంఘాలకు 203 కోట్లు బకాయి లను వెంటనే చెల్లించాలని,తిరుపతి లో ఉన్న ఆర్ డి డి ఆఫీస్ ధర్మవరం లో ఏర్పాటు చేయాలని తెలిపారు.ఇటీవల చీరాలలో చేనేత జన సమాఖ్య నాయకుడు మాచర్ల మోహనరావు పై జరిగిన దాడికి సంబంధించిన దోషులను వెంటనే శిక్షించాలి అని డిమాండ్ చేశారు. పలు సమస్యల పైన సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేత కార్మికుల ధర్నా నిర్వహించారు. తదుపరి కలెక్టర్ 22 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది అని తెలిపారు.
మా ప్రధానమైన డిమాండ్లలో కేంద్రప్రభుత్వ బడ్జెట్ రూ.50 లక్షల 65 వేల కోట్లలో చేనేత రంగానికి 25 వేల కోట్లు కేటాయించాలి అని, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూ.3 లక్షల ఇరవై రెండు వేల కోట్లలో చేనేత రంగానికి కనీసం రూ రెండు వేల కోట్లు కేటాయించి, సకాలంలో నిధులు విడుదల చేయాలిఅన్నారు.
సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్లబకాయిలను వెంటనే చెల్లించాలి అని,రాష్ట్ర అధినాయకత్వం వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం రూ.25 వేల ఆర్థిక సహకారంనేతన్నలందరికీ చేనేత ఉపవృత్తులు చేసుకునే కార్మి కులకు కూడా ఇంకెంత మాత్రం జాప్యం లేకుండావెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు.చేనేతలందరికీ 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకాన్ని, అలాగే ఉపవృత్తుల కార్మికులందరికీ కూడా వెంటనే అమలు పరచాలి అని,
సహకార సంఘాలకు ఉన్న రుణాలను రద్దు చేయాలి అని,చేనేత సహకార సంఘాలు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నుండి తీసుకున్న ఆర్థిక రుణాల పైన కట్టవలసిన వడ్డీలో రాయితీగా రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలి. త్రిప్ట్ ఫండ్ చెల్లించాలి అని తెలిపారు.కేంద్రప్రభుత్వ (1995) హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం ప్రకారం చేనేతలకు 11 రకాల రిజర్వేషన్లను కట్టిన తరం చేసి పకడ్బందీగా అమలు జరపాలి అని,.ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు చట్టఉల్లంఘలను నిరోధించి చేనేతల హక్కు లను కాపాడాలన్నారు.చేనేత వస్త్రోత్పత్తికి వినియోగించే ప్రధాన ముడి సరుకు చిలపనోలకు సంబంధించిన కేంద్రప్రభుత్వ చట్టం హ్యాంకార్న్ నోటిఫికేషన్ ప్రకారం నూలు విలువలు కనీసం 30 శాతము ప్యాకింగ్ చేయాలన్న నిబంధనలను భారతదేశంలోని ప్రతి నులు మిల్లు అమలు చేయాలి అని తెలిపారు.
చేనేత వస్త్రఉత్పత్తికి వినియోగించే చిలపనూలు, జరీ, పట్టు, రంగులు, రసాయనాలు సబ్సి డీ రేట్లకు సప్లై చేయాలి అని తెలిపారు.రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విధంగా, నిల్వ వున్న చేనేత వస్త్రాలను ప్రభుత్వా లు కొనుగోలు చేయాలి అన్నారు. రైతులకు వలనే చేనేతలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలి.తుఫాను తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో పని నష్టపోయిన చేనేత అన్నలకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జి.వో నెంబర్-5 ప్రకారం నష్టపరిహారం, మత్స్యకారులకు వలనే నెలకు 10,000 ఆర్థిక సహకారం రెండు నెలలపాటు అందించాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆకలి చావులతో ఆత్మహత్యలతో మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ -గ్రేషియా చెల్లించాలి అని, ప్రభుత్వాల ప్రభుత్వ సంస్థల అవసరాలకు చేనేత వస్త్రాలనే కొనుగోలు చేసి ఉపయోగించాలన్నారు. నేతన్నలకు మూడు సెంట్లు భూమి ఇచ్చి అందులో హౌస్-కమ్-వర్క్ షెడ్లను ప్రభుత్వ నిర్మించాలి అని,కుటుంబంలో అర్హులైన చేనేత కార్మి కులందరికీ చేనేత పెన్షన్లు మంజూరు చేయాలి అని, చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు ఎన్ని కలు వెంటనే నిర్వహించాలి అని, జౌళిశాఖలో అంతర్భా గంగా ఉన్న చేనేతలను విడగొట్టి, ప్రత్యేకమంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని తెలిపారు. కేంద్రంలోనూ చేనేతలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని తెలిపారు.కేంద్రప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలి అని,. చేనేత కార్మి కులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని చెయ్యాలి.నెల్లూరు నగరంలో గాంధీనగర్ ఆప్కో కు కేటాయించిన స్థలం 6.9 ఎకరముల తిరిగి చేనేతలకు,ఆప్కో లకు, కేటాయించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో చేనేత నాయకులు వెంకటస్వామి,రవికుమార్, యర్రమశెట్టి రమణ, ఎస్ హెచ్ బాషా, హరి, చెన్నంపల్లి శ్రీనివాసులు, సంకరాపు రాజా, వెంకటేష్, శ్రీనివాసులు, మల్లికార్జున, ఆదినారాయణ, పార్థసారథి, నారాయణ స్వామి, నాగరాజు లలితమ్మ, లింగమ్మ,చేనేత మహిళలు, చేనేత కార్మికులు,చేనేత
చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *