హోర్మూజ్ మూసివేస్తే…ఇరాన్ నాశనమే


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్:
అమెరికాఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హోర్మూజ్‌ను మూసివేస్తే..ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామన్నారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు చేశారు. లెబనాన్‌పై ఇరాన్ దాడులను తక్షణమే ఆపాలని, లేకపోతే ఈసారి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. డీల్ కుదరకపోతే ఆ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా హోర్మూజ్ వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గత వారం ఇరాన్‌పై అమెరికా దాడిని ట్రంప్ గుర్తుచేస్తూ...లెబనాన్‌లో ఇరాన్ తమ అధిక వేతనాలతో నడిపే ప్రాక్సీలను వెంటనే ఆపాలన్నారు. ఒకవేళ అలాగే కొనసాగిస్తే తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ‘లెబనాన్‌లో ఇబ్బందులు సృష్టిస్తున్న ప్రాక్సీలను ఇరాన్ తక్షణమే ఆపాలి. అలా చేయకపోతే గత వారం చేసినట్లే, మరింత తీవ్రంగా ఇరాన్‌పై మళ్లీ దెబ్బ కొడతాం’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. చారిత్రక సమావేశం: వాన్స్ ఇదిలా ఉంటే...అమెరికాఇరాన్ మధ్య శాంతి చర్చలు స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ చర్చలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను కొత్త దిశగా మలచుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ‘ఇదో ఒక చారిత్రక సమావేశం. మేము కొత్త అధ్యాయం ప్రారంభిస్తామా లేక పాత విధానాలకే వెళ్తామా అన్నదే ఇప్ప్పుడు మా ముందున్న ప్రశ్న’ అని వాన్స్ వ్యాఖ్యానించారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున జేడీ వాన్స్‌తో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ప్రధాన చర్చల ప్రతినిధి ఎంబీ గాలిబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు పాకిస్థాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి.

The post హోర్మూజ్ మూసివేస్తే…ఇరాన్ నాశనమే appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *