హోర్మూజ్‌లో టోల్ వసూల్ చేస్తాం


జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదు: ట్రంప్
వాషింగ్టన్:
హోర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60రోజుల్లో ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు అమెరికా అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం 60రోజుల పాటు టోల్-రహిత ప్రయాణం ఉండాలన్నారు. మరోవైపు హోర్మూజ్ ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో లేదని, రవాణా నిరంతరాయంగా కొనసాగుతోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు. పరిస్థితి ఇలాగే ఉండేలా అమెరికా దళాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. శనివారం 17మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో 55 వాణిజ్య నౌకలు జలసంధిని దాటినట్లు తెలిపారు. కాగా, ఇరాన్‌తో అణు చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం స్విట్జర్లాండ్‌కు బయల్దేరింది.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు…
ఓ వైపు అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య స్విట్జర్‌ల్యాండ్‌లో చర్చలు మొదలుకానుండగా…మరో వైపు లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. సరిహద్దుల వద్ద పలువురు ఇజ్రాయిల్ ప్రజలు పాలస్థీనీయులపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి తాము ఎదురు దాడులు చేయాల్సి వస్తోందని హెజ్‌బొల్లా ఆరోపించింది.

The post హోర్మూజ్‌లో టోల్ వసూల్ చేస్తాం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *