నాటు సారాయి తయారీదారులపై దాడులు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి


విశాలాంధ్ర ధర్మవరం;; నాటు సారాయి తయారీదారులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో ధర్మవరంలో దాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అనంతపురం ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారు, ఈ ఎస్ టి ఎఫ్ బృందం పుట్టపర్తి వారు నాటు సారాయి తయారీ దారులు , అమ్మకం మద్యం దారులపై దాడులు నిర్వహించామని తెలిపారు. బెల్ట్ షాపు ల పై జరిపిన దాడులలో 2 కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి 21 మద్యం బాటిల్ స్వాదీనం చేసుకోవాడమైనది అని తెలిపారు. అలాగే నాటు సారాయి కేసులో ఒక ఆడ మనిషిని అరెస్ట్ చేసి 3 లీటర్ల నాటు సారాయిని స్వాదినం చేసుకొని , ఆమెను జుడీసియల్ రిమాండ్ కు తరలిoచడం జరిగింది అది తెలిపారు. ధర్మవరం పట్టణం లో మత్తు పదార్థాలు గురించి అవగాహన కలిగించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా
నాటు సారాయి తయారీ దారులు మరియు అమ్మకం మద్యం దారులపై జరిపిన దాడులలో డి. చెర్లోపల్లి క్రాస్ లో గుంజేపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ ను అరెస్ట్ చేసి, అతని నుంచి 08 మద్యం బాటిల్స్ ను స్వాదీనం చేసుకోవడమైనది తెలిపారు. సదరు కేసు ను నమోదు చేయడమైనది అని తెలిపారు. అదేవిధంగా అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ సిఐ సునంద ఆధ్వర్యంలో మండలం ముదిగుబ్బ గ్రామంలో పరమేశ్వర్ నాయుడు అతని నుండి పది మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం అయినది అని తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకొంటామని, అదేవిధంగా తరచుగా ఎక్సైజ్ నేరములు చేసే వ్యక్తులను, పాత నేరస్థులను బైండోవర్ కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు.ఎవరైనా నాటు సారాయి తయారీ దారుల గురించి గానీ, అమ్మకం , రవాణా చేసే వారి గురించి గానీ తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచుతామని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *