విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : విద్యార్థుల విద్యాాభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, చదువుతోనే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమని ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ఉద్ఘాటించారు. జనసేన వీర మహిళ, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, వాల్మీకి సంఘం అనంతపురం నగర అధ్యక్షురాలు బోయ మంజుల ఆధ్వర్యంలో నగరంలోని 28వ వార్డు మరువకొమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీసీ వరుణ్ తన చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యా సామగ్రిని అందజేశారు. అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు, ఊరికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. సేవా భావంతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న బోయ మంజులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం నగర అధ్యక్షుడు పొదిలి బాబూరావు, దూదేకుల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ హుస్సేన్, మేనేజర్ శేఖర్, జనసేన నేతలు తేజరాయల్, వీర మహిళలు శైలజ, శరణ్య, టీడీపీ నాయకులు బాబాజీ, జైబున్నీ, అల్లాబకాష్, బోయ ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.


