వ్యాపారస్తుల ఇబ్బందులు తీర్చండి.. – Visalaandhra


మంత్రికి విన్నవించిన ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు
విశాలాంధ్ర ధర్మవరం;;ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుగు రాష్ట్ర బీసీమహిళా అధ్యక్షురాలు సంకారపుజయశ్రీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల ఇబ్బందులను, సమస్యలను తీర్చాలని కోరుతూ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కార్పొరేట్ రిటైల్ చైన్ల , మార్వాడీల వ్యాపారం వల్ల స్థానిక చిన్నా , మధ్య తరహా వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను మంత్రికి వివరించడం జరిగిందన్నారు.అలాగే ధర్మవరం లాంటి చిన్నచిన్న పట్టణ ల లో నూతనంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నా శరవణ స్టోర్స్ డిమార్ట్ వల్ల స్థానిక వ్యాపార సముదాయాలు పూర్తిగా దెబ్బతింటాయి అని తెలిపారు. నగదు బదిలీ జరగకుండా చిన్న చిన్న వ్యాపారస్తులు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అని తెలిపారు.కార్పొరేట్ రిటైల్ చైన్ ల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాల వ్యాపార సముదాయాలు పూర్తిగా దెబ్బతింటాయి అని, అనతి కాలం నుంచి వస్తున్న ధర్మవరం చేనేత వైభవం కూడా ప్రమాదంలో పడుతుందని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ సమస్యను అర్థం చేసుకున్నాను అని , చిన్న , మధ్య తరహా వ్యాపారవస్తుల పరిరక్షణ కోసం తొందరలోనే క్యాబినెట్ సమావేశంలో చర్చించి , ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ది ఆల్ ట్రైడర్స్ అసోసియేషన్ సభ్యులు మా సమస్యలు పరిష్కారానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చిన మంత్రి సత్య కుమార్కు, రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు జయకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *