కేజీబీవీ విద్యార్థినిలకు త్రిబుల్ ఐటీ లో చోటు


విశాలాంధ్ర తనకల్లు : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఈ సంవత్సరానికి గాను ఇద్దరు విద్యార్థినిలు అయిన భోజనం శ్రావణి, ఎర్రగుడి దివ్యలకు త్రిబుల్ ఐటీలో చోటు దక్కడం హర్షించదగ్గ విషయమని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మరియు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనితలు తెలియజేశారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తమదైన శైలిలో నేర్పుతూ విజయాలనoదిస్తూ వారిని ఉన్నత స్థానాలకు చేర్చడంలో కేజీబీవీ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని so హామీదాబీ ఆనందo వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ కి ఇద్దరు విద్యా ర్థినులు,ఆర్డిటి సంస్థకు ఇద్దరు విద్యార్ధినిలు ఎంపిక కావడం, ఆర్ డి టి స్కాలర్షిప్ నలుగురు విద్యార్థులకు దక్కడం తనకల్లు కేజీబీవీ పాఠశాలకు ఎంతో గర్వకారణమని అందుకు కృషి చేసినటువంటి ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయినులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేశారు. మరెన్నో విజయాలను అందుకుని పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవడంతో పాటు మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *