అన్నాడీఎంకేకు సీనియర్ నటి గౌతమి రాజీనామా


ప్రముఖ సీనియర్ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఆమె ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి లేఖ రాశారు.
ఆ లేఖలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సామాజిక సేవను మరింత సమర్థంగా కొనసాగించేందుకు అనువుగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అలాగే ప్రచార ఉపకార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఁబరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని గౌతమి లేఖలో తెలిపారు.

రెండు దశాబ్దాలపాటు బీజేపీలో పనిచేసిన అనుభవం
అన్నాడీఎంకేలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు తనకు సహకరించిన మాజీ మంత్రులు, పార్టీ అధిష్ఠాన నిర్వాహకులు, జిల్లా కార్యదర్శులు సహా అన్ని స్థాయిల నాయకులకు ఆమె మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. గౌతమి గతంలో భాజపాలో సుమారు రెండు దశాబ్దాలపాటు చురుగ్గా పనిచేశారు. అయితే పార్టీపై అసంతృప్తితో 2023లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం 2024లో అన్నాడీఎంకేలో చేరారు. తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కకపోవడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.

The post అన్నాడీఎంకేకు సీనియర్ నటి గౌతమి రాజీనామా appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *