భారత్‌కు ఐఎండీ అలర్ట్‌.. ఎల్ నినో ఎఫెక్ట్‌తో వర్షాలపై ఆందోళన!


ప్రస్తుత నైరుతి రుతుపవనాలు సీజన్‌లో భారత్‌కు కీలకమైన వాతావరణ హెచ్చరిక వెలువడింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ తన జూన్‌ 2026 బులెటిన్‌లో వెల్లడించింది.సాధారణంగా ఎల్ నినో ప్రభావం భారత వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఎల్ నినో ప్రభావంతో దేశంలో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో కరవు లేదా అనావృష్టి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.ప్రస్తుతం కేంద్ర, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగి ఎల్ నినో స్థాయిని దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మారిన వాతావరణ పరిస్థితులు
కేవలం సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా, దానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితుల్లోనూ గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది.దీంతో సముద్రం, వాతావరణం రెండూ కలిసి పూర్తిస్థాయిలో ఎల్ నినో దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషించింది.ఎల్ నినో తీవ్రతను అంచనా వేసే కీలక సూచిక ఃనినో 3.4 ఇండెక్స్ః గత మూడు నెలల సగటులో ం0.5 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించడంతో ఎల్ నినో ప్రారంభమైనట్లు అధికారికంగా నిర్ధారించారు.

మరింత బలపడే అవకాశం
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఎల్ నినో ప్రభావం ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు.పసిఫిక్ మహాసముద్రం లోతట్టు పొరల్లో కూడా భారీ స్థాయిలో వేడి నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఈ వేడి రాబోయే రోజుల్లో పైకి రావడం ద్వారా ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు.జూన్‌ నుంచి ఆగస్టు మధ్యకాలంలో పసిఫిక్ వ్యాప్తంగా వేడి మరింత విస్తరించి, జూలై తర్వాత ఎల్ నినో తీవ్ర రూపం దాల్చే అవకాశముందని మాన్‌సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్‌(వీవ్పుీఖీS)అంచనా వేసింది.ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌ మొత్తం మీద ఎల్ నినో ఃమధ్యస్థం నుంచి తీవ్రః స్థాయిలో కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.

ఐఓడీపై ఆశలు
అయితే ఎల్ నినో ఏర్పడినంత మాత్రాన భారత రుతుపవనాలు పూర్తిగా దెబ్బతింటాయని భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే భారత వర్షపాతాన్ని ప్రభావితం చేసే మరో కీలక అంశం ఇండియన్ ఓషన్ డైపోల్. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఐఓడీ పరిస్థితులు తటస్థ స్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితి ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడానికీ, పెంచడానికీ ప్రత్యేకంగా సహకరించదని వాతావరణ శాఖ పేర్కొంది.
అయితే ఈ నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ కొంత ఊరట కలిగించే అంచనాలను వెల్లడించింది.
జూన్‌ 11న ఎల్ నినో ప్రారంభాన్ని ప్రకటించిన జపాన్ శాస్త్రవేత్తల ప్రకారం, రాబోయే జూలై నాటికి హిందూ మహాసముద్రంలో పాజిటివ్ ఐఓడీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

భారతదేశంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం
ఒకవేళ పాజిటివ్ ఐఓడీ ఏర్పడితే, పసిఫిక్‌లో బలపడుతున్న సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. తద్వారా భారతదేశంపై పడే ప్రతికూల ప్రభావాన్ని నియంత్రిస్తూ రక్షణ కవచంలా పనిచేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తూ, ప్రతి నెలా తాజా అప్‌డేట్లు అందిస్తామని భారత వాతావరణ శాఖ భరోసా ఇచ్చింది. రాబోయే రోజుల్లో ప్రకృతి అనుకూలంగా మారి, దేశానికి సమృద్ధిగా వర్షాలు కురవాలని అందరూ ఆశిస్తున్నారు.

The post భారత్‌కు ఐఎండీ అలర్ట్‌.. ఎల్ నినో ఎఫెక్ట్‌తో వర్షాలపై ఆందోళన! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *