విశాలాంధ్ర ధర్మవరం : నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో పట్టణమునకు చెందిన ఎంబాపోతులయ్య (85) వెలుగులు నింపి నేత్రదాత అయ్యారని యువర్స్ ఫౌండేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యంబా పోతలయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర ,డాక్టర్ బివి సుబ్బారావు కంటి కార్నియా సేకరించడం జరిగింది అని తెలిపారు. నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు యంబాచంద్రమోహన్,జయసింహ,అదిశేషు, అంజన ప్రసాద్ గార్లకు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ వైకే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు


