మొహరం వేడుకల్లో పచ్చని చెట్లు నరకకండి


– పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం ;​ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా.మొహరం (పీర్ల పండుగ) వేడుకల సంబరాల్లో భాగంగా పచ్చని చెట్లను నరకడం సరికాదని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. అనంతరం వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పండుగ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.పండుగ సంప్రదాయాల పేరుతో ఎదిగిన చెట్లను, కొమ్మలను నరికివేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం లభించకపోగా, తీవ్రమైన పాపం చుట్టుకుంటుందనిహెచ్చరించారు. ​పర్యావరణ పరిరక్షణకు ముఖ్య సూచనలలో​ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించండి: పండుగ ఆచారాల కోసం పచ్చని చెట్లను నరకడానికి బదులు.. ఎండిపోయిన కొమ్మలను లేదా ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించుకోవాలి అని తెలిపారు. ​భవిష్యత్తు తరాలకు నష్టం: ఒక చెట్టు పెరగడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అలాంటిది క్షణికావేశంలో లేదా అజ్ఞానంతో చెట్లను నరికితే రాబోయే తరాలకు ఆక్సిజన్ కొరత, తీవ్రమైన ఎండలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి శాపాలు, ​చట్టపరమైన చర్యలు తప్పవు అని తెలిపారు.అటవీ శాఖ నియమ నిబంధనల ప్రకారం పచ్చని చెట్లను నరకడం చట్టరీత్యా నేరం అని తెలిపారు. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎవరైనా చెట్లను నరికితే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
​ ప్రతి గ్రామంలోని మొహరం ఉత్సవ కమిటీలు ముందస్తుగానే గ్రామస్థులకు ఈ విషయమై అవగాహన కల్పించాలి అని తెలిపారు. పచ్చని ప్రకృతి మధ్య పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అన్నారు.ప్రకృతిని పూజించడమే నిజమైన భక్తి. పచ్చని చెట్లను నరికి భగవంతుడికి ఆగ్రహం తెప్పించవద్దు అని తెలిపారు. పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు , చైతన్యవంతమైన పౌరులందరూ గ్రామాల్లో తిరిగి ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేయాలి అని పిలుపునిచ్చారు.​కావున ఈ మొహరం పండుగను పర్యావరణ హితంగా జరుపుకుని ప్రకృతిని కాపాడుకోవాలని వారు ఉమ్మడి జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

The post మొహరం వేడుకల్లో పచ్చని చెట్లు నరకకండి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *