సమాజానికి సేవ చేసే గుణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి..


డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
విశాలాంధ్ర ధర్మవరం ; సమాజానికి సేవ చేసే గుణమును విద్యార్థులు అలవర్చుకోవాలని స్పందన హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఎస్సీ ఎస్టీ కులమునకు చెందిన పదవ తరగతి విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పదిమంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ హాజరు అయినారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులను జీవితములో మరువరాదని, వారి కష్టాన్ని గుర్తించి కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యము నెరవేరుతుందని తెలిపారు. సమాజానికి కొత్త తరాల వారు ముందుకు రావాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి మార్కులు ఉండాలని, దాంతోపాటు చదువు స్థాయిలో పటిష్టంగా ఉండాలని వారు తెలిపారు. పేద విద్యార్థులకు చదువు తప్ప మరొకటి ఆధారం లేదని, చదువే జీవితానికి సరైన మార్గము అని వారు స్పష్టం చేశారు. చక్కటి ఆలోచన మంచి నిర్ణయంతో ఉజ్వల భవిష్యత్తు కు పునాది అవుతుందని తెలిపారు. అనంతరం డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కులములో ఎంతోమంది ఆర్థిక పరిస్థితి సరిగా లేక చదువుకోలేకపోతున్నారని, కానీ చదువులో మంచి ప్రతిభ కనబరిచినప్పుడు మా వంతుగా మేము ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది మాకెంతో తృప్తిని, సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. వివక్షత అనేది ఉండరాదని, నేటి సమాజంలో సైన్స్ వల్ల భవిష్యత్తులో మార్పు వస్తోందని తెలిపారు. ఆరోగ్యము, మంచి పౌష్టిక ఆహారం ఉన్నంతలోనే మనము భుజించాలని తెలిపారు. అదేవిధంగా శారీరిక శ్రమ ఆరోగ్యములో కీలకపాత్ర వహిస్తోందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా శాస్త్రీయ దృక్పథంతో ముందడుగు వేయాలని తెలిపారు. తదుపరి ఎమ్మెల్సీ కే ఆనంద్ డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా పట్టణంలో చేస్తున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాలను వారు అభినందిస్తూ, వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారిలో విద్యార్థులు కార్తీక్ సంజయ్ ,అర్చన, శీనై, ప్రవీణ్ కుమార్, సహస్ర, మౌనిక బాయి, నవ్య శ్రీ, సాకే బాలు, శ్రావణి, హర్షిత ఉన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిశేషు, డాక్టర్ సత్య నిర్ధారణ, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు లోకేష్, చంద్రశేఖర్ రెడ్డి రామాంజనేయులు, సురేష్, వేణుగోపాల్, హాజ్ వలి తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *