పదవ తరగతి రీవాల్యుషన్ లో ఒక మార్కు పెరగడం.. పట్టణములో ప్రధమ కైవసం


విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని సీబా రామలింగయ్య మనవడు, ఆయుర్వేద డాక్టర్ శీబా నగేష్ గుప్తా, డాక్టర్ సిబా సంగీత కుమారుడు శీబా కేదార్నాథ్ గుప్తా పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 591 మార్కులు తేవడం జరిగింది. తదుపరి ఆ విద్యార్థికి సంతృప్తి లేకపోవడంతో రీవాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకోగా 592 మార్కులను కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో యశోద స్కూల్లో ప్రధమగా రావడం, అదేవిధంగా ధర్మవరం టౌన్ లో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా యశోద స్కూలు యాజమాన్యం తో పాటు, తల్లిదండ్రులు, తాత, బంధుమిత్రులు, తోటి స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి కేదార్నాథ్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *