ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి రెడ్డి హేమంత లు పాల్గొన్నారు. సిఎస్ఈ విద్యార్థుల కోసం “క్లౌడ్ కంప్యూటింగ్ , బ్లాక్‌చైన్ సాంకేతికతలు” అంశంపై అందించిన ఉపన్యాసంలో క్లౌడ్ టెక్నాలజీ ప్రాముఖ్యత, డేటా నిల్వ విధానాలు, సైబర్ భద్రత, బ్లాక్‌చైన్ నిర్మాణ విధానం, భవిష్యత్ ఉద్యోగావకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అదేవిధంగా డాక్టర్ జి రెడ్డి హేమంత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విద్యార్థుల కోసం వి.ఎల్.ఎస్ఐ టెక్నాలజీ అంశంపై ప్రసంగించి, విఎల్‌ఎస్ఐ రూపకల్పన ప్రాముఖ్యత, చిప్ డిజైన్ ప్రక్రియ, సెమీకండక్టర్ పరిశ్రమలో అవకాశాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి గురించి వివరించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక రంగాలపై విస్తృత అవగాహన పొందడంతో పాటు తమ భవిష్యత్ దిశా నిర్ధేశాలపై నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి కళాశాల ప్రిన్సిపాల్ జె.వి సురేష్ బాబు విభాగాధిపతులు యెన్. బాల స్వామి,డాక్టర్ జి.హేమాంజ లు కృతజ్ఞతలు తెలిపారు.


