12న నిర్వహించబడే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..


ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జూన్ 12వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 కంపెనీల కొరకు ఈ ఉద్యోగం ఎలా నిర్వహిస్తున్నామని, పదవ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ పీజీ పూర్తి చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగులు అర్హులు అని తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన వారికి నెలకు 15000 నుండి 25 వేల రూపాయల వేతనం ఉంటుందని తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన వారు పెనుకొండ, అనంతపురం, బెంగళూర్, హిందూపురం, కళ్యాణదుర్గం, గోరంట్ల వంటి ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు ,విద్య అర్హత పత్రాలు తీసుకొని జూన్ 12వ తేదీ ఉదయం 9 గంటలకు హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9182288465కు సంప్రదించాలని తెలిపారు.

The post 12న నిర్వహించబడే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *