డీకే శివకుమార్‌కు మరో షాక్.. శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి!


కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంత్రి కృష్ణ బేరె గౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కృష్ణ బేరె గౌడకు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను ప్పగించినప్పటికీ, ఆ శాఖ పరిధిలోని కీలక సంస్థలైన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ, బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ లను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన వద్దే ఉంచుకున్నారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కృష్ణబేరె గౌడ అసంతృప్తి
ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చాకే శాఖ బాధ్యతలు స్వీకరిస్తానని కృష్ణ బేరె గౌడ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆయన ఢిల్లీకి బయలుదేరారు.కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఈ విషయాన్ని చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా,నగరాభివృద్ధి శాఖ తనకు దక్కకపోవడంపై మంత్రి రామలింగారెడ్డి కూడా ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే ఆయన నీటిపారుదల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయగా,పార్టీ పెద్దల జోక్యంతో అనంతరం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అదే నగరాభివృద్ధి శాఖ అంశంపై కృష్ణబేరె గౌడ అసంతృప్తి వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి చర్చకు దారితీసింది.

మంత్రివర్గ విస్తరణపై ఆశలు.. ఢిల్లీ బాటలో ఎమ్మెల్యేలు
శాఖల కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలతో పాటు, మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *