:కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఫైర్..
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా.. మిగతా వారి జాడ తెలియరాలేదు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలో పెను సంచలనం సృష్టించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఘటనలో కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్విమర్శలు చేస్తూనే ఉంది. కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
The post ఎస్ఎల్బీసీ దుర్ఘటనకు ఏడాది.. appeared first on Visalaandhra.


