కానిస్టేబుల్ మసూద్ వలి ఘన సత్కారం..


అనంతపురం ట్రాఫిక్ పోలీసుగా బదిలీ..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మసూద్ వలి అనంతపురం ట్రాఫిక్ పోలీస్ విభాగానికి బదిలీ అయ్యారు.
గత ఐదున్నర సంవత్సరాలుగా నార్పల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన మసూద్ వలి తన సేవా కాలంలో క్రమశిక్షణతో పాటు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు సహకారం, అలాగే స్టేషన్ పనుల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన ఆయన సేవలను సహచర సిబ్బంది ప్రశంసించారు.ఈ సందర్భంగా నార్పల ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించారు. సహచరులు మాట్లాడుతూ, మసూద్ వలి తన విధుల్లో నిబద్ధతతో పనిచేసి స్టేషన్‌కు మంచి పేరు తీసుకొచ్చారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ జమీందార్ దేవా కుమార్, భీమ్లా నాయక్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బదిలీ సందర్భంగా మసూద్ వలి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్తగా చేరబోయే ట్రాఫిక్ విభాగంలో కూడా తన సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *