నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా


మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ చొరవతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మంగళగిరి పట్టణంలోని వీజే జూనియర్ కాలేజీలో నేడు (జూన్ 5) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ జాబ్ మేళా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 950కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ వంటి విద్యార్హతలు కలిగిన 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. ఎంపికైన వారికి వారి అర్హతలను బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం లభిస్తుందని వివరించారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను వెంట తీసుకురావాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గంలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 8074597926, 7780588993 నంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.

The post నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *