కృష్ణాతీరంలో అమరావతి ‘ఐ’ – Visalaandhra


. లండన్ తరహాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి
. జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు
. అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు
. కొత్తగా ఏపీ విమానయాన పాలసీ`2026
. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం
. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఓ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంగ్లాండ్‌లోని ‘లండన్ ఐ’ తరహాలో కృష్ణానది తీరాన ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు నిర్మాణానికి సీఆర్‌డీఏ ప్రతిపాదించగా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం 6 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని మొత్తాన్ని, నదీ తీర అందాలను తిలకించవచ్చు. పర్యాటకులను ఆకర్షించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుందని మంత్రివర్గం భావించింది. దీనికి తక్షణమే టెండర్లు ఆహ్వానించడానికి కూడా అనుమతి ఇస్తూ మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 35 అంశాలపై చర్చించింది. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
అ అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం సీఆర్‌డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యÖజర్ చార్జీలు మినహాయింపు ఇవ్వడానికి, రాజధాని ప్రాంతంలో జరిగే వివిధ అభివృద్ధిపనులకు సీఆర్‌డీఏ ఆమోదించిన అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అ వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో అవయవ దానం మార్పిడి కార్యకలాపాలను పకడ్బందీగా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ద ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్, 2011 ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడానికి ఆమోదం.
అ అసెంబ్లీ సమావేశాలు 12.03.2026 నుండి వాయిదా పడిన కారణంగా, దీనిని ‘ద ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2026’ పేరుతో ఒక ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయనున్నారు.
అ బీచ్ షాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఆమోదం. మొదటి దశలో చీరాల, విశాఖపట్నంలో ఒక్కొక్క చోట రెండేసి షాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం.
అ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్యాకేజ్ నం.5, 5ఏకు సవరించిన అంచనాల ప్రకారం రూ.796.66 కోట్ల కేటాయింపు.
అ బాపట్ల జిల్లాలో కుందేరు డ్రెయిన్ తవ్వకం పనులకు రూ.517.50 లక్షలు మంజూరు.
అ న్యాయ శాఖ ప్రతిపాదన మేరకు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-1999 కింద నమోదైన కేసులతో పాటు ప్రత్యేకించి అగ్రిగోల్డ్ కేసుల సత్వర విచారణ, పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త పరిధిలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు 21 నూతన పోస్టుల మంజూరు.
అ ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీ 2026 (2026-31)కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని సమÖలంగా మార్చే లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో విమానయాన రంగానికి భారీ ఊతం లభించనుంది. 2035 నాటికి ప్రయాణికుల సామర్థ్యాన్ని 6.2 మిలియన్ల నుంచి 30.38 మిలియన్లకు, ఎయిర్ కార్గోను 6,240 మెట్రిక్ టన్నుల నుంచి 4.27 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరో 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా 150 కి.మీ పరిధిలో విమానాశ్రయ సౌకర్యం కల్పించనున్నారు.రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
అ జూలై 1 ఆంధ్రప్రదేశ్‌లో ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామిన్) అమలు చేయడానికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
అ విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ గ్రామంలో సర్వేనెంబరు 426/3లో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు స్టార్ హోటల్, రిసార్ట్లు లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం బదిలీ చేయడానికి ఆమోదం.
అ చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె మండలం గుడుపల్లె గ్రామంలో 12.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ లిమిటెడ్‌కు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.12,00,000/- చొప్పున చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం.
అ నెల్లూరు జిల్లా సీతరామపురం (వీ), పెదనాగంపల్లి 14.10 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదం.
అ అనకాపల్లి జిలా తుమ్మపాల గ్రామానికి చెందిన కొత్తూరులో 2 ఎకరాలు, కాకినాడలో 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం కోసం 66 సంవత్సరాల లీజు పద్ధతిలో కేటాయించడానికి ఆమోదం.
అ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమిని యÖనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో వార్షిక అద్దె రూ.1,25,23,500/- చొప్పున ప్రతి 5 సంవత్సరాల బ్లాక్‌కు 10శాతం పెంపుతో కేటాయించడానికి ఆమోదం.
అ కృష్ణా జిల్లా చల్లపల్లిలో 11.80 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంఎసఎంఈ పార్క్ అభివృద్ధి కోసం కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం.
అ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా శ్రీసిటీలో ‘శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యÖనివర్సిటీ’ పేరిట నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని (గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద) స్థాపించడానికి వీలుగా ‘ఏపీ ప్రైవేట్ యÖనివర్సిటీస్ యాక్ట్-2016’ షెడ్యూల్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీసిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో 60 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ విశ్వవిద్యాలయం స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లు మరియు యాక్సిలరేటర్లకు కేంద్రంగా పనిచేస్తూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
అ ఈ నెల జూన్ 7 నుండి 21 వరకు పక్షం రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల ప్రామాణిక నిర్వహణ విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలుపుతూ రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ వేడుకల్లో భాగంగా అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పౌరులను భాగస్వాములను చేయనున్నారు. ఇదే క్రమంలో, రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచి ‘ఆరోగ్యక రమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ’ను సాధించే లక్ష్యంతో యోగా అండ్ నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *