ఘనంగా భారత మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :భారత మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గురువారం ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రావణి రెడ్డి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది. ముందుగా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ ఎస్ గిడ్డమ్మ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1954లో భారత జాతీయ మహిళా సమాఖ్య కలకత్తా లో ఏర్పాటు చేయయడం జరిగిందన్నారు. మహిళా సమాఖ్య ఏర్పాటులో ప్రముఖంగా హజారా బేగం, అరుణ ,ఆశఫ్ అలీ ,అనసూయ ,జ్ఞాన్ చంద్ ,పుష్పమయి, బోస్, రేణు చక్రవర్తి ,విమల ,ఫరుకి ,గీతా ముఖర్జీ ,ప్రమీలా లు ముంబాలతో తారారెడ్డి ,గుజ్జుల సరళ దేవిల నాయకత్వంలో భారత జాతీయ మహిళా సమాఖ్య పురుడు పోసుకుందన్నారు. నాటి నుండి నేటి వరకు మహిళా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. దేశంలోని మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ఆనాటి ఉత్తమ పార్లమెంటరీ కామ్రేడ్ గీతా ముఖర్జీ నాయకత్వంలో పార్లమెంటులో గళం విప్పి పోరాటం చేసిందన్నారు.ఈ దేశంలో నీ మహిళలకి స్వేచ్ఛ సమానత్వం, స్వాతంత్రం కావాలని నేటిదాకా పోరాటం చేస్తున్నది మహిళా సమాఖ్య మాత్రమే నన్నారు. నరేంద్ర మోడీ బేటి బచావో, బేటి పడావో అన్న నినాదంతో పరిపాలన చేస్తున్నాడే గాని మణిపూర్ లాంటి రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు ,హత్యలు దాడులు జరుగుతున్న కళ్ళుండి చూడలేని కబోదిగా మారాడని విమర్శించారు. దేశ ప్రధాని బేటి పడావో బేటి బచావో అన్న నినాదం మరి ఎక్కడ నెరవేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని మహిళల కోసం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు కోటమ్మ. రేణు¿.£ ఆశా బేగం .సోఫియా .నగర నాయకురాలు పావని .వెంకటేశ్వరమ్మ .మునెమ్మ .స్వప్న. మాధవి .యశోద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *