న్యూదిల్లీ: తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ’ పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా వర్సిటీతో తమకు సంబంధం లేదని బోర్డులు పెట్టాలని తెలంగాణ కాలేజీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 12వ తేదీ లోగా ప్రముఖ దినపత్రికల్లో పావు పేజీ ప్రకటనలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
The post ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంలో చుక్కెదురు appeared first on Visalaandhra.


