న్యూదిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గగనతలం నుండి భూతల క్షిపణి రుద్ర ఎం-11 ప్రయోగం విజయ వంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సంయు క్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించా యి. భారత్ తన కచ్చితమైన దాడుల సామర్థ్యాల ను బలోపేతం చేయడా నికి, రక్షణ సాంకేతికతలో స్వావలం బనను పెంపొందించుకో వడానికి చేపడుతున్న చర్యల్లో ఈ ప్రయోగం మైలురాయిగా నిలిచింది. అన్ని కీలక ఉపవ్యవస్థలు, ప్రయోగ పరిమితుల పనితీరును ధృవీకరించేందుకు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.


