ఇక బాబ్ అల్ మందెబ్ వంతు


ఇరాన్ తాజా హెచ్చరికలు
తెహ్రాన్: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే విధంగా అమెరికా, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ మరొక ప్రయత్నం మొదలు పెట్టింది. హోర్మూజ్ జల సంధిపై చర్చలు కొనసాగుతుండగానే మరొక కీలక జల సంధిని అడ్డుకోవాలని భావిస్తోంది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు ఆగకపోతే బాబ అల్ మందెబ్ జల సంధిని అడ్డుకుంటామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది. అమెరికాతో చర్చలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. బాబ్ అల్ మందెబ్ సహా కొన్ని మార్గాల్లో ప్రతిచర్యలు తీసుకోవాలన్న యోచనలో యంత్రాంగం ఉన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తుండటంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నది. యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య బాబ్ అల్ మందెబ్ జలసంధి ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ టియర్స’ అని పిలుస్తారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 12-15 శాతం ఈ మార్గంలోనే సాగుతుంది. సూయజ్ కాలువకు వెళ్లే నౌకలకు ఇది కీలకం. బబ్ అల్ మందెప్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ లేనప్పటికీ, యెమెన్‌లోని హౌతీల ద్వారా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది. లెబనాన్, గజాలో ఇజ్రాయిల్ చర్యలు కొనసాగితే, తమ ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స’ హార్మూజ్ తరహాలోనే బాబ్ అల్ మందెబ్‌లో నౌకా రవాణాను అడ్డుకుంటామని ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ తేల్చిచెప్పారు.

The post ఇక బాబ్ అల్ మందెబ్ వంతు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *