విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ లలిత నాట్య కళా నికేతన్ గురువులు బాబు బాలాజీ, హర్షశ్రీ,రామలాలిత్య నిర్వహించిన వేసవి నాట్య శిక్షణా శిబిరము ముగింపు సంబరాలు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.50 మంది శిష్యబృందం చేత “శివ,రామ,కృష్ణ,గోవిందం,”అను నృత్య రూపకం,కుంభజ్యోతి నాట్యం,తరంగం నాట్యం కనువిందు చేశాయి.ముఖ్య అతిథులుగా పోలా ప్రభాకర్ , పోలా,శ్రీనివాస్,పెద్దపోగు ఆనంద్, మొదలైన వారు పాల్గొని పిల్లలకు జ్ఞాపకాలు,మెడల్స్ అందచేశారు.ఈ సారి ప్రత్యేకంగా అమెరికా నుండి విచ్చేసి పిల్లలకు నాట్య శిక్షణ ఇచ్చిన బాబు బాలాజీ పెద్ద కుమార్తె హర్షశ్రీ నీ సీనియర్ విద్యార్థుల తల్లితండ్రులు ఘనంగా సన్మానించారు.


