ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..


శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ సభ్యులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో జూన్ మూడవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి ధర్మవరం, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా, పుష్పగిరి కంటి ఆసుపత్రి, కడప వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వందలాది మందికి కంటి ఆపరేషన్లు చేసి, అద్దాలను కూడా ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కంటికి ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఉచిత రవాణా ఉచిత వసతి ఉచిత భోజనం ఇతర సౌకర్యములు అన్నీ కూడా ఉచితంగా కల్పించబడునని తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చు రోగులు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు ఒరిజినల్ను, జిరాక్స్ పతులను తీసుకొని రావలెనని తెలిపారు. ఈ శిబిరంలో చిన్న పిల్లలకు వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరము పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *