ప్రభుత్వ పాఠశాలతో పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు….డీఈవో చంద్రకళ


విశాలాంధ్ర- నందిగామ : ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను అభ్యసిస్తే ప్రతిభవంతులవుతారని ఎన్టీఆర్ జిల్లా డీఈవో చంద్రకళ అన్నారు మంగళవారం పట్టణంలో పాత బస్టాండ్ పలు ప్రాంతాలలో విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అడ్మిషన్ల కొరకు స్థానిక డీవైఈవో గురునాథం,ఎంఈఓ లతో కలిసి బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తే విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే రైతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు అలాగే ఉన్నతమైన విద్యను చదివి ప్రభుత్వ పరిశీలన ద్వారా ఉపాధ్యాయులుగా నియమించబడిన వారి శిక్షణలో పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు ప్రభుత్వం విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే మధ్యాహ్న భోజనం ఉచిత పుస్తకాలు యూనిఫామ్ తోపాటు తల్లికి వందనం విద్యా కానుక వంటి పథకాలు త్వరితగతిన అమలు చేస్తుందని పేర్కొన్నారు బడి ఈడు పిల్లలు ఒకరు కూడా బడికి దూరం కాకూడదని ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు తల్లిదండ్రులు ముందుగా పిల్లలను చేర్పించాలని కోరారు జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని మొదటి వంద శాతం హాజరు ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని స్థానిక అధికారులను ఆమె ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సిఆర్పిలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు….



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *