విద్యార్థుల విజయాలకు ప్రోత్సాహంగా ప్రతిభా పురస్కారాలు


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన మాదిగ విద్యార్థి మందల ప్రభంజన్, బాయ్స్ టౌన్ స్కూల్ లో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో 563 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన సందర్భంగా అనంతపురంలో మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం లో ఘనంగా సన్మానించి ప్రతిభ పురస్కారం ధర్మవరం విద్యార్థులకు బహుమతి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని నాయకులు పేర్కొన్నారు. కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన మందల ప్రభంజన్‌కు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.మాదిగ విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మందల ప్రభంజన్ కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పలువురు అభినందనలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *