ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ను మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సోనియా, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, పుల్లయ్య, డాక్టర్ హరి శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వివిధ వార్డులను వారు పరిశీలించారు. ఫార్మసీ వాడను కూడా పరిశీలించి అన్ని మందులు సక్రమంగా రోగులకు అందే విధంగా బాధ్యతతో పనిచేయాలని సిబ్బందికి తెలియచేశారు. తదుపరి ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి లక్షల విలువచేసే వైద్య పరికరాలను కూడా వారు పరిశీలించారు. ఇటువంటి పరికరాలు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాల జబ్బులకు డాక్టర్లు ఉండడం, ఓపిగూడ అధికంగా పెరగడం శుభదాయకమని తెలిపారు. లక్షలు విలువ చేసే పరికరాలు పేద ప్రజలకు సేవలు చేసే విధంగా వైద్యులందరూ కూడా సహకరించాలని తెలిపారు. ప్రస్తుతం రేడియాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చి వెంటనే ఆ పోస్టును భర్తీ చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు రోగులకు అందే విధంగా రోగులకు అవగాహనను కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఫిర్యాదు అందినా కూడా, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇంకనూ ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని వైద్య పరికరాలు అవసరంగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వ ఆసుపత్రి నిధులతో భర్తీ చేయాలని సూపర్డెంట్ కు సూచించారు. రోగులతో ప్రేమతో మాట్లాడాలని, మందుల కన్నా వైద్యులు సిబ్బంది మాట్లాడే సందర్భాలలో సగం ఆరోగ్యవంతులు అవుతారని తెలిపారు
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇకపోతే ప్రభుత్వ ఆసుపత్రి 24 గంటల పాటు రోగులకు సేవలు చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు వస్తే సూపర్డెంట్ కు తెలియజేసి పరిష్కరించుకోవాలని తెలిపారు.


