సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి


యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా మానవతా విలువలను పెంపొందించవచ్చునని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, వైకే శ్రీనివాసులు, కోటేశ్వరరావు, కౌన్సిలర్ కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షీలా నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలను తమ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారంతో నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేటి ఈ సేవా కార్యక్రమానికి దాతగా ఎర్రజోడు లోకేష్ జన్మదిన సందర్భంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం దాతకు యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ వారు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వారిని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. తదుపరి ఆసుపత్రి తరఫున ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రజోడు చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *