వత్సవాయి మండల టీడీపీ ఉపాధ్యక్షులుగా దారెల్లి చిరంజీవి


మహానాడు పండుగ వేళ వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీలో సరికొత్త ఉత్సాహం

​విశాలాంధ్ర- వత్సవాయి: సమర్థుడైన నాయకుడు ప్రజా సేవకు కట్టుబడిన వ్యక్తి దారెల్లి చిరంజీవి వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల మండల ప్రజల్లో హర్షం
దారెల్లి చిరంజీవి అంటే మండల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కష్టం ఎక్కడ ఉంటే కార్యకర్తకు నష్టం జరిగితే తనదైన శైలిలో చేయూతనిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలబడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలబడుతున్నారని అనడంలో అతిశయోక్తి లేదు….. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులుగా అధికార పూర్వకంగా పదవిని ఇవ్వడంతో పోలంపల్లి గ్రామ మరియు వత్సవాయి మండల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…. అహర్నిశలు ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి పట్టం కట్టడం సంతోషదాయకమని మండల ప్రజలు అంటున్నారు.

మహానాడు వేడుకల సాక్షిగా వారు నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆశీస్సులతో ​మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు సహకారంతో మరియు​పోలంపల్లి సొసైటీ అధ్యక్షులు మన్నే బాలకృష్ణ సహాయ సహకారాలతో ఈ బాధ్యతలను తీసుకుంటున్నానని నేటి నుండి
నాయకత్వానికి సరికొత్త నిర్వచనం ఇస్తూ, అందరినీ కలుపుకుపోతూ మండలంలో పార్టీ బలోపేతానికి సమగ్ర స్థాయిలో కృషి చేస్తానని నాపై నమ్మకంతో ఇంతటి బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్క నాయకులకు బాధ్యతాయుతంగా బాధ్యుడిగా ఉంటానని సభా ముఖంగా తెలిపారు.
ఈ కార్యక్రమం లో మండల ప్రముఖ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *