ఇజ్రాయిల్ నమ్మకద్రోహి: పాక్


వాషింగ్టన్/ఇస్లామాబాద్: అమెరికా ‘అబ్రహం ఒప్పందం’ ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది. ఇజ్రాయెల్‌తో మామÖలు సంబంధాలను కలిగి ఉండాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తికి పాకిస్థాన్ ఒప్ప్పుకోలేదు. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్‌తోపాటు పాకిస్థాన్ కూడా అబ్రహం ఒప్పందంపై తప్పనిసరిగా సంతకం చేయాలని ట్రంప్ మెలిక పెట్టడం ఈ వివాదానికి తెర తీసింది. తమ దేశ ప్రాథమిక సిద్ధాంతాలు, ఆదర్శాలకు విరుద్ధంగా ఉండే ఒప్పందాల్లో భాగస్వాములు కాబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ స్పష్టంచేశారు. ఇజ్రాయిల్ వైఖరిని ఎండగట్టారు. ఆ దేశాన్ని నమ్మకద్రోహిగా వర్ణించారు. అలాంటి దేశంతో సత్సంబంధాలు పాక్‌కు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అసలు ఇజ్రాయిల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించే ప్రస్తావనే పాకిస్థాన్ విధానంలో లేదని ఆసిఫ్ వెల్లడించారు. కాగా, ఇజ్రాయిల్`అరబ్ మధ్య దశాబ్దాల శత్రుత్వాన్ని ముగించి… దౌత్య, ఆర్థిక, రక్షణ సంబంధాల మెరుగుదలకు 2020లో ‘అబ్రహం అకార్డ్స’ ప్రారంభమయ్యాయి. మొదట యూఏఈ, బహ్రెయిన్ ఆ తర్వాత మొరాకో, సూడాన్, కజకిస్థాన్ ఇందులో చేరాయి.

The post ఇజ్రాయిల్ నమ్మకద్రోహి: పాక్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *