సైప్రస్ సార్వత్రిక ఎన్నికల్లో ఏకేఈఎల్`ప్రోగ్రెసివ్ పార్టీ సత్తా


నికోసియా: సైప్రస్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏకేఈఎల్ప్రోగెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ సత్తా చాటింది. 23.86శాతం ఓట్లతో రెండవ స్థానం దక్కించుకుంది. 56కుగాను 15 సీట్లు గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన అనంతరం ఏకేఈఎల్ ప్రధాన కార్యదర్శి స్టెఫనోస్ మాట్లాడుతూ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితం నిదర్శనమన్నారు. పార్లమెంటులో, ప్రజల్లో పార్టీ మరింత బలాన్ని పుంజకున్నట్లు తెలిపారు. నాయకుల మాటల మాయాజాలం నుంచి ప్రజలను బయటకు తేవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అనేక అడ్డంకులు దాటుకొని తమ పార్టీ పురోగమించిందన్నారు. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ట్రెండ్‌కు ముగింపు పలికి, పార్లమెంటులో బలాన్ని పెంచుకున్నట్లు స్టెఫనోస్ వెల్లడించారు. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, కార్మికులకు మద్దతు, మధ్యతరగతి, యువత, పింఛన్‌దారుల సమస్యలు, సామాన్యులకT నిత్యజీవితంలో ఎదుర్కొనే సవాళ్లపైనే ఎన్నికల ప్రచారం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారానికి తమ పార్టీ పటిష్ఠ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ప్రోగ్రెసివ్ ఫ్రంట్‌లో కీలకశక్తిగా ఏకేఈఎల్లెఫ్ట్సోషల్ అలయెన్స్ ఉన్నట్లు తెలిపారు. రాజకీయ, సామాజిక మార్పు లక్ష్యంతో ముందుకు వెళతామన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థల బలోపేతానికి, మతతత్వవాదును అడ్డుకునేందుకు, కార్మిక హక్కుల పరిరక్షణకు సంకల్పించారు. ప్రగతిశీల సంఘటన విస్తరణను ఆశించారు. కాగా డెమొక్రటిక్ ర్యాలీ (డీఐఎస్‌వై) 17 స్థానాలు గెలుచుకొని 27.15 శాతం ఓట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మÖడో స్థానంలో నిలిచిన నేషనల్ పాపులర్ ఫ్రంట్‌కు 10.90శాతం ఓట్లు... ఎనిమిది స్థానాలు దక్కగా... డెమొక్రటిక్ పార్టీకి 10శాతం ఓట్లు, ఎనిమిది స్థానాలు వచ్చాయి. అలాగే ఏఎలఎంఏసిటిజన్స్ ఫర్ సైప్రస్‌కు నాలుగు, డైరెక్ట్ డెమొక్రసీ సైప్రస్‌కు నాలుగు చొప్ప్పున సీట్లు లభించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *