2 నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ముగింపు వేడుకలు


. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
. అర్హులందరికీ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం

విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం విజయవంతం కావడంతో, జూన్ రెండు నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. 12 రోజుల పాటు గ్రామసభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఇప్పటివరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ ì రాబోయే రోజుల్లో ప్పు్రల భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశిం చింది. ఇందులో భాగంగా జూన్ 2 నుంచి 12 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా ‘పర్యావరణ వారోత్సవం’, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం, మహిళా-శిశు రక్షణ, గృహ నిర్మాణం, పర్యాటక ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, పునర్వినియోగ శక్తి (గ్రీన్ ఎనర్జీ) ప్రాజెక్టుల శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలను నిర్వహిం చాలని నిర్ధేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీì సుదీర్ఘంగా చర్చించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పునరుద్ఘాటించారు. ఈ బీమా పథకానికి ఒక విశిష్టమైన ‘లోగో’ను రూపకల్పన చేయనున్నారు. “రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి సమగ్ర డేటా సేకరణ, పథకం ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ప్రతి ఇంటికి లోగోతో కూడిన స్టిక్కర్లను అతికించడం” వంటి కార్యాచరణ ప్రణాళికలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డీజీపీ సీవీ ఆనంద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, వికాస్ రాజు, నవీన్ మిత్తల్, వాణి ప్రసాద్, దాన కిషోర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు సందీప్ కుమార్ సుల్తానీయా, గౌరవ్ ఉప్పల్, తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

The post 2 నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ముగింపు వేడుకలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *