విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ వాహనాలలో ఇంధన పొదుపు చేయాలన్న ఆదేశాల మేరకు ధర్మవరం పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు మాస్టర్ కార్యాలయ తనీఖీలు, వాళ్లు వార్డులలో కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఏవైనా సమస్యలు ఉన్నాయా? అన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడక్కడ వార్డు ప్రజలతో కాలువ శుభ్రత, వాటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ పరిశుభ్రతలో ఏదైనా లోపాలు వస్తే ప్రజలు నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.


