ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra


నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం జోనల్ నాయకులు శేఖర్, ఏఎస్ రావు రీజినల్ నాయకులు ముత్యాలప్ప మోహన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి అని ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. శ్రీ శక్తి బస్సులలో జీరో టికెట్టు ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మిగతా ప్రయాణికులకు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని సిబ్బందిపై పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. పిఆర్సి కమిటీలు నియమించి ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు అరియర్స్ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే ప్రకటించాలని తెలిపారు. ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేసి అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు. ఏపీపీ టీడీ ఉద్యోగులను ఈ హెచ్ ఎస్ నుండి మినహాయించి గతంలో ఆర్టీసీ నందు ఉన్న వైద్య సదుపాయమును అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగప్ప గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ ,హరికృష్ణ డిపో అధ్యక్షుడు గోపాలప్ప, ట్రెజరర్ వైవిఆర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఖాన్, ఏడీసీ శ్రీనివాసులు, ఎన్సీజీ రావు తదితరులు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *