అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి మంత్రి సత్య కుమార్ సహాయం


విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన ఎం. తరుణ్ కుమార్ రెడ్డి గత 12 సంవత్సరాలుగా క్రానిక్ మైలోయిడ్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్న విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి , ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి వచ్చినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వారి కార్యాలయం సిబ్బంది తెలిపారు. వారు మాట్లాడుతూ తరుణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి సత్య కుమార్ యాదవ్ కలిసి తమ కుటుంబ పరిస్థితిని, దీర్ఘకాలిక వైద్య చికిత్స కారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల వినతిపై మంత్రి వెంటనే స్పందించి, బాధితుడికి అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ఈ మేరకు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాయగా, ముఖ్యమంత్రి సహాయ నిధి పరిధిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం రూ.2,50,000 ఆర్థిక సహాయం మంజూరైనట్లు వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కావడంతో బాధిత కుటుంబానికి పెద్ద ఊరట లభించింది. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి వైద్య సహాయం అందేలా చొరవ చూపిన మంత్రి సత్య కుమార్ యాదవ్ కు తరుణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *