ఆంజనేయ స్వామి మాన్యం భూమి ఆక్రమణ (ఆన్‌లైన్) నమోదుపై చింతలపల్లి గ్రామస్థుల ఆగ్రహం


విశాలాంధ్ర ధర్మవరం;మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో ఉన్న స్వామి మాన్యం (దేవుడి) భూమి కొంతమంది వ్యక్తుల పేరిట ఆన్‌లైన్ కావడంపై స్థానిక గ్రామస్థులు, నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) లో చింతలపల్లి మహేష్ చౌదరి ,గ్రామస్థుల తో పాటు ఆర్డీఓ, ఎంఆర్‌ఓలను కలిసి ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామస్థుల కథనం ప్రకారం… చింతలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 253 లో ఆంజనేయ స్వామి మాన్యానికి చెందిన భూమి ఉంది. అయితే, ఈ భూమిని పట్టణానికి చెందిన చింతా రామలక్ష్మి, గుండా సుబ్బలక్ష్మి అనే వ్యక్తుల పేర్లపై అక్రమంగా ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేసినట్లు వారు గుర్తించారు.
దేవుడికి చెందిన మాన్యం భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై ఎలా మారుస్తారు? ఆన్‌లైన్ రికార్డుల్లో ఉన్న వారి పేర్లను తక్షణమే తొలగించాలి అని అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి మాన్యం భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అక్రమంగా ఆన్‌లైన్ అయిన పేర్లను వెంటనే రికార్డుల నుండి తొలగించి, ఆ భూమిని తిరిగి స్వామి మాన్యానికి (దేవాలయానికి) చెందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారి చింతలపల్లి గ్రామస్థులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *