పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి


విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ పై 3.29, డీజిల్ పై 3.14 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఓక మాట, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓక మాట మాట్లాడం ప్రధాని నరేంద్ర మోడీకే చెల్లిందని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు చందంగా ప్రజల పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహబూబ్, నాగరాజు, రాజు, ఈరన్న, తాయప్ప, హుస్సేన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *