సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్


తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన 116 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే, మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగలరు. ప్రస్తుత పరిస్థితుల్లో కింగ్ మేకర్‌గా విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) నిలిచింది. ఈ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిద్దరూ మద్దతు ఇస్తే విజయ్ బలం 118కి చేరుతుంది. అయితే, వీసీకే అధినేత తిరుమావళవన్ ఇంకా డీఎంకే నాయకత్వంతో చర్చలు జరుపుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. ఈ రోజు విజయ్ స్వయంగా తిరుమావళవన్‌ను కలిసి మద్దతు కోరనున్నారు. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక చెన్నైలో టీవీకే శ్రేణులకు పండుగే. నిన్నటి వరకు అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే, ఐయూఎంఎల్ పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేయడం విజయ్ కు పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ బుధ, గురువారాల్లో మూడుసార్లు గవర్నర్ అర్లేకర్‌ను కలిసినప్పటికీ, ఆయన నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందలేదు. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖలను సమర్పించాల్సిందేనని గవర్నర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బలం నిరూపించుకోకుండా ప్రమాణ స్వీకారానికి అనుమతించబోమని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *