సీనియర్ రక్తదాతలకు సన్మానం


ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సీనియర్ సభ్యులు డాక్టర్ సంకారపు నరసింహులు

రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ దంపతులు ఎక్కువసార్లు రక్తం ఇచ్చిన రక్తదాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెంన్రీ డ్యూనాంట్”జన్మదినం, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్బంగా సీనియర్ రక్తదాతలకు సన్మానం చేయడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అని తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతలు బులగొండ్ల నాగేష్ (32సార్లు), మల్లాకాల్వ చంద్రశేఖర్ (22సార్లు),కోనాపురం సాయిప్రసాద్ (15సార్లు), గోసే రాధాకృష్ణ (6సార్లు) రక్త ధానం చేసి సమాజసేవలో వారు చేసిన సేవాభావానికి గుర్తించి వారిని సన్మానించడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. పదుల సంఖ్యలో తమ రక్తాన్ని ఇచ్చి పునర్జన్మణి ఇచ్చిన వారు దైవంతో సమానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివయ్య,డాక్టర్ రషీద్, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సత్యనిర్ధారన్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

The post సీనియర్ రక్తదాతలకు సన్మానం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *