సుహాస్ సినిమా పేరు మార్పు


హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్‌ను ‘ఫ్రెండ్లీ కపుల’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా నటించిన ‘హే భగవాన్!’ చిత్రానికి కూడా సెన్సార్ సమస్య తలెత్తింది. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు దీనిని ‘హే బలవంత్!’గా మార్చారు. నరేష్ వ్యాపారం ఏంటో గెస్ చేయమంటూ పెట్టిన కాంటెస్ట్‌తో ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘రైటర్ పద్మభూషణ’ ఫేమ్ షణ్ముఖ ప్రశాంత్ కథ అందించారు. సుదర్శన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు కొత్త టైటిల్‌తో థియేటర్లలోకి రానుంది.

The post సుహాస్ సినిమా పేరు మార్పు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *