“అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్”


విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జేఎన్టీయూఏలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో “అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అపెక్స్ బాడీ సభ్యులు మెట్టుపల్లి రామచంద్ర రెడ్డి మార్గదర్శకత్వం వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూఏ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు సభను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా రెవెన్యూ అధికారి మనోహర్ బాబు, అటవీ శాఖ అధికారి నాయుడు లు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక సేవ మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం సమాజానికి విశిష్ట సేవలందించిన డా. జి. హేమలత, ప్రొఫెసర్ గిద్దలూరి ప్రకాష్ రెడ్డి, బిసాతి భరత్, కురుబ జయమరుతి, అమర్ సాయినాథ్ రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి లను
సందర్భంగా అవార్డులతో సత్కరించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ మమత కర్నూలు , యోగా మాస్టర్ మహేష్ , డిడిసి మెంబర్ రమణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు జెఎన్‌టియు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. జి. మమతా ఈ కార్యక్రమ విజయవంతం కు విశేష సహకారం అందించారు.

The post “అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్” appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *