చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. – Visalaandhra


ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికుల సమస్యలను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి చేనేత కార్మికుల ఓట్లను దండుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్ట లేకపోవడం దారుణం అన్నారు. చేనేత కార్మికులకు 25వేల రూపాయలు నేతన్న నేస్తం ప్రతి సంవత్సరం అందిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరములు పూర్తి కావస్తున్న ఇంతవరకు ఆ హామీని అమలుపరచలేదని వారు దుయ్యబట్టారు.అదేవిధంగా చేనేత పరిశ్రమకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని తుంగలో తొక్కి విధంగా పవర్లూమ్స్ లో పూర్తిస్థాయిలో చేనేత రకాలు నేస్తున్న కనీసం చట్టపరమైన చర్యలు చేపట్టలేకపోయారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా పవర్ లూమ్స్ యాజమాన్యానికి 500 యూనిట్లు విద్యుత్ బిల్లును ఉచితంగా ఇచ్చి చేనేత పరిశ్రమకు గొడ్డలి పెట్టు లాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం కోసం బడ్జెట్లో 2000 కోట్ల రూపాయల కేటాయించాలని ,పెరుగుతున్న ముడిసరుకు ధరలను తగ్గించాలని రేషము జరి విపరీతంగా ధరలు పెరగడంతో కార్మికులు విపరీతంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా చేనేత పట్టు చీరలకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలని ,మగ్గం నేస్తున్న ప్రతి కార్మికులకి నేతన్న నేస్తం వర్తింపజేయాలని , ధర్మవరంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసు ఏర్పాటు చేయాలని ,అనేక రకాల డిమాండ్ల సాధనకై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి శ్రీ సత్యసాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టీ అయ్యుబుఖాన్,ఎల్ ఆదినారాయణ ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ఆంజనేయులు, మారుతి ,హసన్ వలి తదితరులు పాల్గొన్నారు . తదుపరి
జిల్లా కన్వీనర్ గా జే.వీ. రమణ, కో కన్వీనర్లు గా జింక నాగరాజు, గుంపు హరి, ఏ ఖాదర్బాషా ,వి. వెంకటస్వామి, అన్నం సూరి, లను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *