శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra


రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలు
నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028 నాటికి మÖడు దశల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ప్లాంట్ ద్వారా మÖడు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలో దీర్ఘకాలిక అభివృద్ధిలో భాగంగా క్యారియర్ సంస్థ శ్రీసిటీలో అత్యాధునిక స్మార్ట్ తయారీ యÖనిట్‌ను స్థాపించనుంది. ఈ ప్లాంట్ హెచ్‌వీఏసీ, సంబంధిత ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాకుండా.. కార్యకలాపాల సామర్థ్యాన్ని, విస్తృతిని పెంచనుంది. ఈ యÖనిట్ అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక ప్లాంట్ మెషినరీతో ఏర్పాటుకానుంది. తద్వార భవిష్యత్‌కు సిద్ధమైన తయారీ సామర్థ్యాలు, సాంకేతిక సమన్వయం, పోటీ సామర్థ్యం కలిగిన వాతావరణం ఏర్పడుతుంది.ఈ క్యారియర్ ఏసీ పరిశ్రమకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో క్యారియర్ సంస్థ కార్యకలాపాలు ఐదు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్నాయి. హర్యానాలోని గుర్ గ్రామ్‌లో తయారీ యÖనిట్, హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఈ సంస్థ ఇప్పటికే కలిగి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *