టీఎంసీ ఓడిపోలేదు… ఇది ప్రజా తీర్పు కాదు
. బీజేపీ విజయం కుట్రపూరితం
. ఈసీతో కుమ్మక్కై 100 స్థానాలు దోచుకుంది
. ఈ ఎన్నికలకు సీఈసీ ప్రధాన విలన్
. మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
. ‘ఇండియా’కు మద్దతు ప్రకటన
కోల్‌కతా: తృణమÖల్ కాంగ్రెస్ ఓడిపోలేదని, కాషాయ పార్టీకి మద్దతిచ్చిన ఎన్నికల సంఘంతో తలపడిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఈసీ ఓ విలన్‌గా మారారని దుయ్యబట్టారు. తమ నుంచి బలవంతంగా 100 స్థానాలు లాక్కున్నారని తీవ్రంగా ఆరోపించారు. గెలుపు కోసం ఎన్నికల సంఘాన్ని బీజేపీ వాడుకుందని విమర్శించారు. తన రాజకీయ ప్రస్తానంలో ఇంతటి కుటిల క్రీడలు ఎన్నడూ చూడలేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇండియా ఐక్య సంఘటన మరింత బలాన్ని కూడకట్టుకుందని ఆకాంక్షించారు. మమతా బెనర్జీ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓటమిని అంగీకరించడం, రాజీనామా చేయడం జరగదని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లనని, రాజీనామా కోసం తనను ఎవరూ ఒత్తిడి చేయలేరన్నారు. ‘బీజేపీతో కాదు… ఈసీతో మా పోరాటం. నా జీవితంలో ఇలాంటి ఎన్నికను చూడలేదు. 2004 తర్వాత ఇంతటి అఘాయిత్యాలను చూడలేదు. ఎన్నికల సంఘమే ప్రధాన విలన్. ఎసఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లT తొలగించారు. బీజేపీ 100 సీట్లT దొంగిలించింది. మమ్మల్ని ఓడించడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్ర చేశారు. సాధ్యమైన ప్రతీ ఎత్తుగడ వేశారు. మా కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మా పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు’ అని మమతా బెనర్జీ అన్నారు. ఇండియా ఐక్య సంఘటన తనకు మద్దతిచ్చిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్, తేజస్వీ యాదవ్ ఫోన్ చేసి తనతో మాట్లాడారని ఆమె తెలిపారు. అఖిలేష్ యాదవ్ బెంగాల్ వస్తున్నారని కూడా మమత వెల్లడించారు. తాను ఇక స్వేచ్ఛాజీవినన్నారు. ‘ఇండియా’ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలను హింసించడాన్ని బీజేపీ అప్ప్పుడే మొదలుపెట్టేసిందని వ్యాఖ్యానించారు. ఎస్‌సీ, ఎస్‌టీ కుటుంబాలపై దాడి చేశారని, అత్యాచారం చేస్తామని బెదిరించారని బీజేపీ తీరును మమత ఖండించారు. బీజేపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము మార్పును కోరుకుంటున్నామని, ప్రతీకారం కాదని అన్నారు. మొదటి విడత ఓట్ల లెక్కింపు తర్వాత బీజేపీ ఇన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటూ వార్తల ప్రసారం మొదలు కాగానే బీజేపీ గూండాలు తనపై దాడి చేశారని మమత ఆరోపించారు. తనను వీపుపై, కడుపుపై కాళ్లతో తన్నారని, కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపేశారన్నారు. బీజేపీ గెలిచింది ప్రజాతీర్పు వల్ల కాదని.. కుట్రలోనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తూ… ఈవీఎంలను తారుమారు చేస్తూ… సీఈసీ ఓ విలన్‌గా మారారన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలలో 80-90 శాతం ఛార్జ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు తమ పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం, సోదాలు నిర్వహించడం వంటివి జరిగినట్లు తెలిపారు. ఐపీఎస్, ఐఏఎస్‌లను మార్చేశారన్నారు. ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ గేమ్ ఆడిందని వ్యాఖ్యానించారు. అన్ని యంత్రాంగాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఎసఐఆర్ పేరిట 90 లక్షల ఓటర్లను తొలగించగా, తాము కోర్టుకెళితే 32 లక్షల పేర్లT చేర్చారని గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని, 100 స్థానాýను తమ నుంచి కాజేశారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. టీఎంసీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి లెక్కింపు ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా చేపట్టారన్నారు. ఎన్నికల చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని మమత అన్నారు. ఎన్నికల అనంతర హింసతో ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు 10 మంది సభ్యులతో నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2021లో ఎన్నికల తర్వాత హింస జరగలేదని, ఆ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. భవనీపూర్‌లో ఉద్దేశపూర్వకంగానే పధకం ప్రకారం తనను ఓడించారని, ఈసీని దుర్వినియోగించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ కార్యకర్తలను కొట్టారని, తనను ‘సీఆర్‌పీఎఫ్ గూండాలు’ పొత్తికడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారన్నారు. టీఎంసీని ఓడించేందుకు అన్ని రకాలుగా బీజేపీ ప్రయత్నించిందన్నారు. ఇకపై ఓ సామాన్య నాయకురాలిగా ఇండియా ఐక్య సంఘటన బలోపేతానికి కృషి చేస్తానని మమత తెలిపారు. ‘ఇప్ప్పుడు నాకు పదవి లేదు… నేను స్వేచ్ఛా జీవిని. నా జీవితాన్ని ప్రజలకు సేవ చేశాను. గత 15 ఏళ్లలో ఒక్క పైసా ఫించన్‌గా పొందలేదు. ఒక్క పైసా వేతనం తీసుకోలేదు. ఇప్ప్పుడు స్వేచ్ఛా జీవిని కాబట్టి నేను కొంత పని చేయాలి. అది చేస్తాను. ఇండియా ఐక్య సంఘటన బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. ఇండియా ఐక్య సంఘటన నాయకులంతా నాకు మద్దతిచ్చారు. వారంతా ఒక్కొక్కరు రాబోతున్నారు. అఖిలేశ్ యాదవ్ ఈరోజే వస్తానన్నారు. నేను రేపు (బుధవారం) రమ్మని చెప్పాను. నేను లోక్‌సభకు వెళతాననే వార్తల్లో నిజం ýదు. బెంగాల్‌లోనే ఉండి పోరా&తాను’ అని మమతా బెనర్జీ వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీ కంచుకోటలో బీజేపీ పాగా వేసింది. 294కుగాను 208 స్థానాలు గెలుచుకుంది. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 15 వేల ఓట్లతో మమతను ఓడించారు.
The post రాజీనామా ప్రసక్తే లేదు appeared first on Visalaandhra.


