ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు..విజయ్ ఎన్నికల విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్


కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ఃతమిళగ వెట్రి కళగంః (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ఁతన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీని ఓడిస్తాడని కలైంగర్ (కరుణానిధి) కలలో కూడా ఊహించి ఉండరుఁ అని ఆర్జీవీ పేర్కొన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తండ్రే కరుణానిధి కావడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన విజయ్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలో నిలిచి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధాన శక్తిగా అవతరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *