కరెస్పాండెంట్ సెట్టిపి నిర్మలాదేవి
విశాలాంధ్ర ధర్మవరం:; పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయకేతనం ఎగురవేసిందని పాఠశాల కరస్పాండెంట్ శెట్టిపి నిర్మలాదేవి, పాఠశాల వ్యవస్థాపకుడు ఎస్.రామిరెడ్డి, డైరెక్టర్లు ఎస్. సూర్యప్రకాశ్ రెడ్డి ,ఎస్. పద్మా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 592 మార్కులతో ఎస్. అంజుమ్ ప్రథమ స్థానం, 589 మార్కులతో శ్రీ లహరి రెండవ స్థానం, 583 మార్కులతో పి యశ్వంత్ కుమార్, 583 మార్కులతో వై గిరిధర్ తృతీయ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీరితోపాటు 582 మార్కులను డి. హదసా, 582 మార్కులతో సి.నవదీప్, 580 మార్కులతో ఖ్యాతి శ్రీవాణి, 579 మార్కులతో యు నరేంద్ర, బి. మధుమిత కైవసం చేసుకున్నారని తెలిపారు. 570 మార్కులకు పైగా 14 మంది విద్యార్థులు, 550 కు పైగా 27 మంది విద్యార్థులు మార్కులను సాధించడం విశేషం అని తెలిపారు. మొత్తం మీద 500 కు పైగా మార్కులు 66 శాతం మంది విద్యార్థులు సాధించడం గొప్ప విజయమని తెలిపారు. ఈ ఫలితాలకు కృషిచేసిన ఉపాధ్యాయ బృందమునకు తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు.


