మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..


బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర సోమవారం గ్రాముకు రూ.1300కు పైగా తగ్గింది. ఈ రోజు (ఫిబ్రవరి 16న) మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,56,440కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,310 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,200 రూపాయలు తగ్గింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,56,590కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,43,550కి చేరుకుంది. ఇక, వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. మళ్లీ రూ.2.7 లక్షల మార్క్‌ దిగువకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.7 వేల మేర తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.68 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.2.68 లక్షలుగా ఉంది.

The post మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *