విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 173 మంది లో 590 మార్కులకు పైగా నలుగురు విద్యార్థులు, 580 మార్కులు పైగా 28 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 79 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ కూడా కరెస్పాండెంట్ మల్లికార్జున తో పాటు డైరెక్టర్ పృథ్వీరాజ్ ప్రిన్సిపాల్ అనూప్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


